Telugu Global
Telangana

తెలంగాణ జీవన్‌దాన్‌కు జాతీయ స్థాయి పురస్కారం

తెలంగాణ ప్రభుత్వం 2012లో 'జీవన్‌దాన్' పేరుతో ఒక సంస్థ ప్రారంభించింది.

తెలంగాణ జీవన్‌దాన్‌కు జాతీయ స్థాయి పురస్కారం
X

తెలంగాణ జీవన్‌దాన్‌కు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. అవయవదానం, టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అత్యుత్తమ సేవలు అందించడంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. అవయవదానం ప్రాధాన్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కారణంగా.. అనేక మంది అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో అవయవ దాతలు పెరగడంతో అనేక మంది ప్రాణాలు నిలుస్తున్నాయి. దేశంలో అవయవదానంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తమిళనాడులో నిర్వహించిన అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ జీవన్‌దాన్ మిషన్‌కు అవార్డు లభించింది. దీనిని జీవన్‌గాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత అందుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం 2012లో 'జీవన్‌దాన్' పేరుతో ఒక సంస్థ ప్రారంభించింది. మొదట్లో ఆరు నెలల పాటు అవయవదానం ప్రాముఖ్యత, ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించడంపై విస్తృతంగా ప్రచారం చేసింది. 2013లో తొలిసారిగా చెన్నైకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి తొలి సారిగా జీవన్‌దాన్ ద్వారా అవయవాలను దానం చేశారు. అక్కడి నుంచి రాష్ట్రంలో అవయవదానంపై అవగాహన పెరిగి.. ఎంతో మంది తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అవయవదానం చేయడంతో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమంగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ రాష్ట్ర అవార్డును అందించింది.

జీవన్‌దాన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌కు 2015లో స్కోచ్ అవార్డు లభించింది. తాజాగా అవయవదానంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకున్నది. గత 9 నెలల్లో రాష్ట్రంలో 160 ఆర్గాన్ డొనేషన్స్ జరిగాయి. ఈ ఏడాది చివరి నాటికి 200 దాటుతుందని అధికారులు చెబుతున్నారు. రెండేళ్లలో 1,100 మంది ప్రాణాలు కాపాడినట్లు కోఆర్డినేటర్ స్వర్ణలత తెలిపారు.

First Published:  24 Sept 2023 8:18 AM IST
Next Story