Telugu Global
Telangana

జాతీయ సమైక్యత దినోత్సవం.. కేసీఆర్ షెడ్యూల్

సీఎం కేసీఆర్ సమైక్యత దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తారు.

జాతీయ సమైక్యత దినోత్సవం.. కేసీఆర్ షెడ్యూల్
X

సెప్టెంబర్-17న తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రతి ఏటా జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది కూడా కార్యక్రమాలను ఘనంగా చేపట్టబోతోంది. సీఎం కేసీఆర్ సమైక్యత దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.

జిల్లా కేంద్రాల్లో ఘనంగా ఉత్సవాలు..

జిల్లా కేంద్రాల్లో కూడా జాతీయ సమైక్యత దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్ లు, విప్ లు, మహిళా కమిషన్ చైర్ పర్సన్, ఎమ్మెల్సీలు లు తమకు కేటాయించిన జిల్లా కేంద్రాల్లో జెండా ఆవిష్కరిస్తారు. రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్ధిపేటలో హరీష్ రావు, మెదక్ లో తలసాని, ఖమ్మంలో పువ్వాడ, జనగామలో ఎర్రబెల్లి సహా.. ఇతర మంత్రులు కూడా తమ జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని షెడ్యూల్ విడుదల చేశారు. ఏయే జిల్లాల్లో ఎవరెవరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలనే సమాచారాన్ని సీఎస్‌ శాంతికుమారి వెల్లడించారు.

పోటాపోటీ కార్యక్రమాలు..

ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కార్యక్రమం చేపడుతోంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల వేళ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టాలని బీజేపీ సిద్ధమవుతోంది. అటు కాంగ్రెస్ కూడా సోనియాగాంధీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సభకు ఏర్పాట్లు చేస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాల వేళ కాంగ్రెస్ కూడా ఈనెల 17న జాతీయ నాయకత్వంతో తమ సత్తా చూపాలని ఉబలాటపడుతోంది.

First Published:  12 Sept 2023 5:00 AM IST
Next Story