రాజాసింగ్ శోభాయాత్రలో గాడ్సే నే రాముడు!
హైదరాబాద్ లో, వివాదాస్పద నాయకుడు,బీజేపీ బహిష్కృత నేత, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతి సారి లాగానే ఈ సారి కూడా భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఆయన నిర్వహించిన శోభాయాత్రలో ఆయన అనుచరులు మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఫోటోలను ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా నిన్న ఒకరికి మించి ఒకరు పెద్ద ఎత్తున శోభాయాత్రలు నిర్వహించారు. బీజేపీ, ఆరెస్సెస్, ఇతర హిందుత్వ సంఘాలు వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీలు చేశాయి. కొన్ని చోట్ల ఇతర మతాల వారితో ఘర్షణలకు కూడా దిగారు. ఈ శోభాయాత్రలను అనేక చోట్ల బీజేపీ తన ప్రచార యాత్రలుగా మార్చింది.
హైదరాబాద్ లో, వివాదాస్పద నాయకుడు,బీజేపీ బహిష్కృత నేత, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతి సారి లాగానే ఈ సారి కూడా భారీ శోభాయాత్రను నిర్వహించారు. ఆయన నిర్వహించిన శోభాయాత్రలో ఆయన అనుచరులు మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఫోటోలను ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేశారు.
దూల్‌పేట్ లోని హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజాసింగ్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆయన అనుచరులు పాల్గొన్నారు. అయితే ఆయన అనుచరులు జైశ్రీరామ్ అనే జెండాలతో పాటు నాథూరామ్ గాడ్సే ఫొటోను ప్రదర్శించారు. గాడ్సే ఫోటోలు పట్టుకొని ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.
మహాత్ముని హంతకుడి ఫోటోలతో ఊరేగింపు తీసిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీనిపై నెటిజనులు అనేక రకాలుగా స్పంధిస్తున్నారు. పలువురు దీన్ని ఖండిస్తుండగా , మరి కొంతమంది హిందుత్వ వాదులుమాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు. చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.