ఖేడ్ అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. క్యాడర్‌లో గందరగోళం
సురేష్ షెట్కార్, సంజీవ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. సురేష్ షెట్కార్‌కు జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా మరో స్థానంలో అభ్యర్థిని మార్చింది. నారాయణ ఖేడ్ నుంచి గతంలో సురేష్ షెట్కార్‌కు టికెట్ కేటాయించిన హస్తం పార్టీ.. తాజాగా ఆయనను తప్పించి పట్లోళ్ల సంజీవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది.
సురేష్ షెట్కార్, సంజీవ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. సురేష్ షెట్కార్‌కు జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పట్లోళ్ల సంజీవ రెడ్డి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి 33 వేల ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన సురేష్ షెట్కార్ 37 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇక నారాయణ ఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు.
ఇప్పటివరకూ కాంగ్రెస్ బోథ్, వనపర్తి, పటాన్ చెరు అభ్యర్థులను మార్చింది. బోథ్ నుంచి మొదట వన్నెల అశోక్‌ను అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం.. మరలా ఆడే గజేందర్‌కు అవకాశం ఇచ్చింది. ఇక వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని తప్పించి ఆయన స్థానంలో మెగా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు నీలం మధు ముదిరాజ్‌కు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది కాంగ్రెస్. ఆయన స్థానంలో పటాన్‌చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్‌కు అవకాశం ఇచ్చింది.