నందికంటికి ఎంబీసీ కార్పొరేషన్.. ముత్తిరెడ్డి, రాజయ్యకు ఛైర్మన్ పదవులు!
ఇక జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఆర్టీసి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడంతో.. జనగాం టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయిస్తారని ప్రచారం జోరు అందుకుంది.
BY Telugu Global6 Oct 2023 7:47 AM IST

X
Telugu Global Updated On: 6 Oct 2023 7:47 AM IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. స్టేషన్ ఘనపూర్ టికెట్ కడియం శ్రీహరికి కేటాయించిన బీఆర్ఎస్.. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను రైతుబంధు సమితి ఛైర్మన్ గా నియమించింది.
ఇక జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఆర్టీసి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడంతో.. జనగాం టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయిస్తారని ప్రచారం జోరు అందుకుంది.
ఇటీవల మల్కాజిగిరి టికెట్ దక్కదన్న అసంతృప్తితో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్‌ను ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. వీరితోపాటు మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story