Telugu Global
Telangana

కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష

ఇంటికి వచ్చిన తల్లి.. కుమార్తె కడుపు నొప్పి తాళలేక విలవిలలాడిపోవడం చూసి గట్టిగా నిలదీసింది. తండ్రి తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని చిన్నారి తల్లితో చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష
X

కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు గురువారం తీర్పు చెప్పింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. తల్లి ఇంట్లో లేని సమయంలో 11 సంవత్సరాల కన్న బిడ్డపై దారుణానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లి.. కుమార్తె కడుపు నొప్పి తాళలేక విలవిలలాడిపోవడం చూసి గట్టిగా నిలదీసింది. తండ్రి తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని చిన్నారి తల్లితో చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించారు. అనంతరం ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి.. ఆధారాలు సేకరించారు. ఈ ఘటనలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో నాంపల్లి కోర్టు అతనికి కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది.

First Published:  17 Nov 2023 7:56 AM IST
Next Story