Telugu Global
Telangana

కేసీఆర్‌ను కలిసిన నల్గొండ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

పీఆర్టీయూ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు

కేసీఆర్‌ను కలిసిన నల్గొండ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
X

నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎర్రవల్లి నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ సన్నిహితుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యాడు.ఎన్నికలు జరిగిన తీరు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ తెలంగాణ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మెుత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా.. మెుదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 13969 ఓట్లతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో… అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టకపోయినా… వెనుక ఉండి చక్రం తిప్పింది. పింగిలి శ్రీపాల్ రెడ్డి , ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్లను వెనుకుండి నడిపించారు కేసీఆర్‌. ఇక ఇందులో పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలవుగా… ప్రసన్న హరికృష్ణ పోరాడి ఓడిపోయాడు.ఈ తరుణంలోనే… కేసీఆర్‌ను కలవడంతో తెలంగాణ రాజకీయల్లో ఆసక్తి రేపుతున్నాయి

First Published:  6 March 2025 9:55 AM IST
Next Story