నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్..50 శాతం పూర్తి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆధిక్యంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి నిలిచారు.
BY Vamshi Kotas3 March 2025 2:51 PM IST

X
Vamshi Kotas Updated On: 3 March 2025 2:51 PM IST
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎమ్మెల్సీ కౌంటింగ్ లో పూర్తయిన మొదటి రౌండ్ పోల్ అయిన ఓట్ల వివరాలు శ్రీపాల్ రెడ్డి 6700 (PRTU), నర్సిరెడ్డి 4778, హర్షవర్ధన్ 4421 (కాంగ్రెస్), పూలరవీందర్ 3216, నరోత్తం రెడ్డి 2347 ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు 24139 పోలయ్యాయి. 93.57 ఓటింగ్ శాతం నమోదైంది. 25 టేబుళ్లపై 25 రౌండ్లలో కౌంటింగ్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 350 మంది కౌంటింగ్ సిబ్బంది, 250 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story