Telugu Global
Telangana

బీఆర్ఎస్‌కు వేముల వీరేశం గుడ్ బై.. నెక్ట్స్‌ ఏ పార్టీలోకి అంటే..!

2014లో నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వేముల వీరేశం. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి చవిచూశారు.

బీఆర్ఎస్‌కు వేముల వీరేశం గుడ్ బై.. నెక్ట్స్‌ ఏ పార్టీలోకి అంటే..!
X

బీఆర్ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. నకిరేకల్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కన్ఫామ్ చేయడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నకిరేకల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి బీఆర్ఎస్‌తో తనకు ఉన్న బంధం తెగిపోయిందన్నారు. ఇక నుంచి నేను మీ బిడ్డనంటూ అక్కడి కార్యకర్తలకు చెప్పారు. సాదుకుంటరో.. సంపుకుంటరో మీ ఇష్టమంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వారంలో రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. వేముల కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఏం చేశానని నాలుగున్నరేళ్లుగా హింసిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు వేముల వీరేశం. ఉద్యమకాలంలో దెబ్బలు తిని జైలుకు పోయింది తాను‌ కాదా.. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులతో కొట్టించినా జిల్లా‌ నాయకత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గన్‌మెన్లను తొలగించిన, చిత్రహింసలు పెట్టినా భరించానన్నారు.

2014లో నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వేముల వీరేశం. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఏ పదవి లేకుండా బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి గులాబీ కండువా కప్పుకున్నారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని గతంలో చెప్పిన కేసీఆర్..ఈ సారి చిరుమర్తికే టికెట్ ఖాయం చేశారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన వేముల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

*

First Published:  23 Aug 2023 6:30 PM IST
Next Story