Telugu Global
Telangana

మునుగోడంటే 'నడ్డా'కెంత ప్రేమో! 2016 హామీలు ఇప్పటికీ నెరవేరలేదు

2016 లో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మునుగోడు నియోజవర్గంలో పర్యటించి ఫ్లోరైడ్ బాధితుల కోసం అనేక హామీలిచ్చారు. ఆ హామీలు ఏమైనాయనే ప్రశ్న ఇప్పుడు ముందుకొచ్చింది.

మునుగోడంటే నడ్డాకెంత ప్రేమో! 2016 హామీలు ఇప్పటికీ నెరవేరలేదు
X

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తీవ్రమైన‌ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలతో, ఆరోపణలతో దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాత విషయాలు కూడా ఇప్పుడు బైటికి వస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీలు, తప్పకుండా చేస్తామని చెప్పిన పనులు మర్చిపోయిన నాయకులపై ప్రజలు కూడా విరుచుకపడుతున్నారు.

ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2016 లో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేశారు. ఆ హోదాలో 2016 లో ఆయన తెలంగాణలో పర్యటించారు. అప్పుడు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మర్రి గూడెంలో ఫ్లోరైడ్ బాధితులను కలిసి మాట్లాడారు. అప్పుడాయన అనేక హామీలిచ్చారు. మర్రి గూడెంలో 300 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని, చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, సామాజిక భద్రత కింద ఫ్లోరైడ్ బాధితులకు సహాయం అందజేస్తామని ఫ్లోరైడ్ బాధితులకు హామీ ఇచ్చారు.


ఆయన ఆరోజు హామీలిచ్చి వెళ్ళిపోతే మళ్ళీ ఇటు మొఖం చూడలేదు. సరికదా ఆ హామీల గురించి పూర్తిగా మర్చిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఈ హామీలను పట్టించుకోలేదు. అసలు మునుగోడు నియోజకవ్ర్గం ఒకటి ఉందనే విష‌యమే మొన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరిందాకా వాళ్ళకు తెలియకపోవచ్చు కూడా.

హామీలిచ్చిన కేంద్ర బీజేపీ సర్కార్ ఆ హామీలను గాలికొదిలేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోరైడ్ ప్రాంతాలను ఫ్లోరైడ్ రహితంగా చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. కృష్ణా జలాలను ప్రతి గ్రామానికి తీసుకవచ్చి తాగు నీరు అందించి. ఇప్పుడసలు అక్కడ ఫ్లోరైడ్ సమస్యనే లేకుండా చేసింది.

అయితే అప్పుడు హామీ ఇచ్చిన జేపీ నడ్డా కానీ , అప్పుడు ఆయన్తో పాటు ఉన్న తెలంగాణ నాయకులు గానీ మళ్ళీ మునుగోడు వైపు వెళ్ళిన పాపానపోలేదు కానీ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వచ్చేసరికి మళ్ళీ మునుగోడు పై అల్వికాని వరాల వర్షం కురిపిస్తున్నారు. మరి ఎన్నికలు అయిపోయాక ఏం చేస్తారో చూడాలి.

First Published:  19 Oct 2022 12:57 PM IST
Next Story