మైనంపల్లి చాప్టర్ క్లోజ్.. పాత ఆడియో వైరల్
కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటున్న ఆయన, రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇప్పుడు హైలైట్ గా మారాయి. అయినా కూడా మైనంపల్లిని కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటుందా, ఒకటి కాదు, రెండు టికెట్లు ఇచ్చి సంతృప్తి పరుస్తుందా అనేది తేలాల్సి ఉంది.
బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన సందర్భంలో మైనంపల్లి హన్మంతరావు ఒక్కసారిగా టాక్ ఆఫ్ తెలంగాణ అయ్యారు. మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకు మరోసారి టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. కానీ, తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలనేది ఆయన డిమాండ్. మెదక్ లో తన కొడుక్కి సీటివ్వాలని అడుగుతున్న మైనంపల్లి, మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా ఆయన తగ్గేది లేదన్నారు. మల్కాజ్ గిరితో సరిపెట్టుకోలేనన్నారు. ఇటీవల ఆయన కాస్త సైలెంట్ కాగా.. పాత ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఆయన అందర్నీ బండబూతులు తిడుతున్నట్టుగా ఉంది.
మైనంపల్లి హన్మంతరావు ఆడియో వైరల్..
— (@Nallabalu1) August 25, 2023
రేవంత్ రెడ్డి MKL తొక్కుతా అన్న
pic.twitter.com/7Q2o0I6V3V
ఫాల్తూ -- ని నేను, నేనెవరికీ భయపడను, సీఎంకి, పీఎంకి ఎవరికీ భయపడనంటూ మైనంపల్లి చెబుతున్నట్టుగా ఉంది ఆ ఆడియో. అందులో రేవంత్ రెడ్డిని కూడా ఆయన తొక్కుతా అని అన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లాలని అనుకుంటున్న మైనంపల్లి ఆ పార్టీ వాళ్లని ఏం తిట్టినా ఎవరూ పట్టించుకోరు. అయితే కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటున్న ఆయన, రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇప్పుడు హైలైట్ గా మారాయి. అయినా కూడా మైనంపల్లిని కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటుందా, ఒకటి కాదు, రెండు టికెట్లు ఇచ్చి సంతృప్తి పరుస్తుందా అనేది తేలాల్సి ఉంది.
కథ ముగిసినట్టే..
మైనంపల్లిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనకు తానుగా బయటకు వెళ్లే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు సీఎం కేసీఆర్. పార్టీ మల్కాజ్ గిరి టికెట్ కేటాయించి గౌరవించినా, రెండు టికెట్ల ఆశతో ఆయన బీఆర్ఎస్ ని వదిలేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా ఇది ఆయనకు ఇబ్బంది కలిగించే అంశమే. ఇప్పుడు పాత ఆడియో వైరల్ కావడంతో ఆయన మరింత చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని తిట్టిన మైనంపల్లిని అసలు కాంగ్రెస్ లో చేర్చుకుంటారో.. లేదో.. కూడా తెలియదు. మొత్తమ్మీద ఆ ఆడియో ఇప్పుడు మైనంపల్లి పొలిటికల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతోందనమాట.
*