Telugu Global
Telangana

48 గంటల కరెంట్.. జూనియర్ మైనంపల్లి జబర్దస్త్ కామెడీ

కాంగ్రెస్ పార్టీ మెదక్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ 48గంటల కరెంట్ ఇస్తామంటూ కామెడీ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

48 గంటల కరెంట్.. జూనియర్ మైనంపల్లి జబర్దస్త్ కామెడీ
X

రైతులకు ఉచిత కరెంటు విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదే పదే వైరి వర్గాలకు టార్గెట్ అవుతోంది. 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా, 3 గంటల కరెంటు చాలు అని చెప్పే కాంగ్రెస్ కావాలా అని ఆ పార్టీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా కొత్త పల్లవి అందుకున్నారు. తాము కూడా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, అసలు 3 గంటల ప్రస్తావన తాను చేయలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ మెదక్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ 48గంటల కరెంట్ ఇస్తామంటూ కామెడీ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఓవైపు మైనంపల్లి హన్మంతరావు ప్రచారంలో బూతులు మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తనయుడు ఇలా అమాయకంగా మాట్లాడుతూ సోషల్ మీడియాకి బుక్కైపోతున్నారు. రోజుకి 25 గంటలు ఉంటే 25 గంటలు, 48 గంటలు ఉంటే 48 గంటలు కరెంటు ఇస్తామని చెబుతున్నారు మైనంపల్లి రోహిత్.

మరోవైపు అసలు జూనియర్ మైనంపల్లి డాక్టరే కాదంటున్నారు బీజేపీ నేతలు. రోహిత్ నకిలీ డాక్టర్ అని బీజేవైఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన ఫేక్‌ డాక్టర్‌ సర్టిఫికెట్లను వారం రోజుల్లో బయట పెడతామని తెలిపారు. రోహిత్ ఏ రోజూ కాలేజీకి వెళ్లలేదని, వేరే వాళ్లతో పరీక్షలు రాయించాడని ఆరోపించారు. ఝూటా మాటల్లో మైనంపల్లి హన్మంతరావు ఏక్‌ నంబర్‌.. ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్‌ దస్‌ నంబర్‌ అని విమర్శించారు.

అటు బీఆర్ఎస్ కూడా మైనంపల్లి ఫ్యామిలీని టార్గెట్ చేసింది. మైనంపల్లి డబ్బు మైనాన్ని ఈసారి ప్రజలు తమ ఓటుతో కరిగించాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. తండ్రీకొడుకులిద్దరికీ ఓటమి తప్పదన్నారు.

First Published:  11 Nov 2023 8:02 AM IST
Next Story