Telugu Global
Telangana

స్టార్ట్, కెమెరా, యాక్షన్: నా ఫోన్ పోయింది

ఈనెల 5న తన అరెస్ట్ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగిందని, ఆ తోపులాటలో తన ఫోన్ పోయిందని చెబుతున్నారు బండి. ఫోన్ పోయిన నాలుగు రోజులకు ఆయన ఈమెయిల్ ద్వారా కంప్లయింట్ ఇవ్వడం విశేషం.

స్టార్ట్, కెమెరా, యాక్షన్: నా ఫోన్ పోయింది
X

బండి సంజయ్ డ్రామా మొదలైంది. తన ఫోన్ పోయిందంటూ ఆయన కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమెయిల్ ద్వారా కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఆయన తన ఫిర్యాదు కాపీని పంపించారు. ఈనెల 5న తన అరెస్ట్ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగిందని, ఆ తోపులాటలో తన ఫోన్ పోయిందని చెబుతున్నారు బండి. ఫోన్ పోయిన నాలుగు రోజులకు ఆయన ఈమెయిల్ ద్వారా కంప్లయింట్ ఇవ్వడం విశేషం.

పేపర్ లీకేజ్ కి ఫోన్ కి లింకు..

టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్ట్ తర్వాత.. ప్రెస్ మీట్ పెట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. ఆయన ఫోన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పేపర్ బయటకు పంపించిన ప్రశాంత్ తో బండి సంజయ్ ఫోన్ సంభాషణ, వాట్సప్ సంభాషణ చేశారని చెప్పారు రంగనాథ్. అయితే బండి తన ఫోన్ దాచిపెట్టారని, అది దొరికితే సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిలో దొరికినట్టేనని అన్నారు. బండి సంజయ్ కాల్ డేటా సేకరించాలి, డిలీట్ చేసిన మెసేజ్ లను తిరిగి రప్పించాలి, అలా చేయాలంటే బండి సంజయ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలన్నారు సీపీ రంగనాథ్. కానీ ఆయన ఇవ్వలేదు. ఆ తర్వాత అరెస్ట్, జైలు, బెయిలు.. అన్నీ తెలిసినవే. అయితే ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బండి సంజయ్ తన ఫోన్ పోయినట్టు ఫిర్యాదు ఇవ్వడం మాత్రం గమనార్హం.

డ్రామా షురూ..

బండి సంజయ్ ఫిర్యాదుతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. అనుకున్నట్టుగానే బండి సంజయ్ డ్రామా స్టార్ట్ చేశారని మండిపడుతున్నారు నేతలు. కావాలనే ఫోన్ మాయం చేసి, సాక్ష్యాధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించి, ఇప్పుడా ఫోన్ పోయిందని నాటకమాడుతున్నారని అంటున్నారు. బండి ఫోన్ దొరికితే, అసలు విషయం బయటపడుతుంది. అది నిజంగా పోతే దొరుకుతుంది, పోవడం నాటకమైతే ఎప్పటికీ దొరికే అవకాశమే లేదు. మరి పోలీసులు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

First Published:  9 April 2023 9:42 PM IST
Next Story