లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్ లో నాపేరు లేదు - కవిత
ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల రేపు సీబీఐ విచారణకు హాజరుకాలేనని తన లేఖలో చెప్పిన కవిత. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తన నివాసంలో విచారణ జరపవచ్చని చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఎఫ్ఐఆర్, నిందితుల జాబితా, ఫిర్యాదును పరశీలించానని.. కానీ తన పేరు అందులో ఎక్కడా లేదని కవిత పేర్కొన్నారు.
అదే విధంగా ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల రేపు సీబీఐ విచారణకు హాజరుకాలేనని తన లేఖలో చెప్పిన కవిత. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తన నివాసంలో విచారణ జరపవచ్చని చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని తెలిపారు.
ఇంతకు ముందు కూడా కవిత సీబీఐ కి ఓ లేఖ రాశారు. ఎఫ్ఐఆర్ కాపీ, డాక్యుమెంట్లు తనకు పంపాలని, ఆ అతర్వాతే విచారణ తేదీని ఖరారు చేయాలని కవిత తొలి లేఖలో చెప్పారు. దానికి జవాబుగా సీబీఐ వెబ్‌సైట్‌లో ఎఫ్ఐఆర్ (FIR), ఫిర్యాదు ఉన్నట్లు (CBI) తెలిపింది.వెబ్‌సైట్లో ఉన్న ఎఫ్ఐఆర్, నిందితుల జాబితా, ఫిర్యాదును పరశీలించిన అనంతరం కవిత సీబీఐ కి మళ్ళీ లేఖ రాశారు.