Munugode Bypoll Results: 6వ రౌండ్ లో కూడా టీఆరెస్ ఆధిక్యం
మునుగోడు ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచీ ఆధిక్యత ప్రదర్శిస్తున్న టీఆరెస్ ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి 2162 ఓట్ల ఆధిక్యతతో బీజేపీ కన్నా ముందుంది.
BY Telugu Global6 Nov 2022 12:45 PM IST

X
Telugu Global Updated On: 6 Nov 2022 12:50 PM IST
మునుగోడు ఓట్ల లెక్కింపులో ఆరవ రౌండ్ పూర్తయ్యింది. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ బీజేపీ కన్నా 2162 ఆధిక్యంలో ఉంది. ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ 1430 ఓట్ల ఆధిక్యంలో ఉండగా ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి 2162కు చేరింది. మొదటి రౌండ్ నుంచి కూడా టీఆరెస్ ఆధిక్యం ప్రదర్శించింది. అయితే ప్రతి రౌండ్ లో కూడా బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నది. అలాగే కాంగ్రెస్ కూడా పూర్తిగా రంగంలోంచి వెళ్ళిపోయిందన్న వాదనలు కూడా సరికాదని అర్దమవుతోంది.
ఇక అర్బన్ ఓట్లు మొత్తం బీజేపికి పడతాయనే ప్రచారం కూడా చౌటుప్పల్ పట్టణం పటాపంచలు చేసింది. మున్సిపాలిటీ అయిన చౌటుప్పల్ లో కూడా బీజేపీకి ఊహించినన్ని ఓట్లు రాలేదని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పడం పట్టణ ఓటర్లు పూర్తిగా బీజేపీతో ఉన్నారన్న వాదనలు తప్పని అర్దమవుతోంది.
Next Story