Telugu Global
Telangana

పోస్టల్ బ్యాలెట్ తో టీఆర్ఎస్ బోణీ.. కాంగ్రెస్ కి భారీ షాక్

ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేసి, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

పోస్టల్ బ్యాలెట్ తో టీఆర్ఎస్ బోణీ.. కాంగ్రెస్ కి భారీ షాక్
X


మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. పోస్టల్ బ్యాలెట్ లో తన ఆధిక్యం నిరూపించుకుంది. స్వల్ప ఆధిక్యమే అయినా.. టీఆర్ఎస్ ఆధిపత్యం ఇక్కడినుంచే మొదలైందని అంటున్నారు. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు పోలవగా అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 228 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 224 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీకి 10ఓట్లు, ఇతరులకు 88 ఓట్లు పోలైనట్టు అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్ బాగా వెనకపడిపోయింది.

ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేసి, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా చౌటుప్పల్‌ మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలైంది. తుది రౌండ్‌ ఫలితం ఒంటి గంటకు తేలిపోతుంది. ఆ తర్వాత అధికారికంగా ఫలితాలు ప్రకటిస్తారు.

మునుగోడులో మొత్తం 2,41,805 మంది ఓటర్లు ఉండగా.. 2,25,192 ఓట్లు పోలయ్యాయి. 93.1 శాతం పోలింగ్ జరిగింది. మునుగోడు చరిత్రలో ఇదే అత్యథిక పోల్ పర్సంటేజ్. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రధాన పార్టీలన్నీ తమకే అనుకూలం అని అంచనా వేస్తున్నాయి. సర్వేలన్నీ అనుకూలంగా రావడంతో టీఆర్ఎస్ ధీమాగా ఉంది. ప్రచారం సరిగా సాగకపోవడంతోపాటు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గుట్టు రట్టు కావడంతో బీజేపీ మధ్యలోనే కాడె పడేసింది. అందుకే చివరి రోజుల్లో బీజేపీ జాతీయ నాయకులు కూడా ప్రచారానికి మొహం చాటేశారు.

First Published:  6 Nov 2022 9:10 AM IST
Next Story