మునుగోడు ఎన్నిక: బిజెపి ఉక్కిరి బిక్కిరి .. అయోమయ వ్యాఖ్యలు చేస్తున్న నేతలు
మునుగోడు ఎన్నికల్లో బీజెపి నాయకులకు ఓటమి భయం పట్టుకుందా? వారు చేస్తున్న అయోమయ వ్యాఖ్యలు వింటూ ఉంటే అదే నిజమనిపిస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న పరిణామాలు భారతీయ జనతా పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాంతో ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అధికార టిఆర్ఎస్ పై లేనిపోని ఆరోపణలతో రంకెలు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘు నందనరావు వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నా యంటున్నారు. ఇప్పడు టిఆర్ ఎస్ లోకి మారుతున్న బిజెపి నాయకులు భౌతికంగా అక్కడ ఉన్నా వారు పనిచేసేది మాత్రం తమ పార్టీకే అని రఘునందన రావు వ్యాఖ్యలు చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బిజెపిలోకి వలసలు ఉంటాయని జోస్యం చెప్పారు. కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలనుంచి ఇద్దరేసి ఎమ్మెల్యేలు బిజెపిలో చేరనున్నారని చెప్పారు.
కాగా రఘునందనరావు వ్యాఖ్యలు అర్ధరహితమని విమర్శలు వస్తున్నాయి. ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తుందనుకున్న బిజెపి మునుగోడు ఉప ఎన్నిక ల్లో వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటుగా ఉందని టిఆర్ ఎస్ లో చేరిన దాసోజు శ్రవణ్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్య యుతంగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల్లో డబ్బు సంచులు పంచి గెలవాలను కోవడం దారణమని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి తీరు జీర్ణించుకోలేకనే ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నానని శ్రవణ్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు.
ఎన్నికలకు ముందే బిజెపి పట్ల ప్రజల వైఖరి ఏంటో స్పష్టమైపోవడంతో బిజెపికి దిక్కు తోచడంలేదని అందుకనే ఆ పార్టీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి నేతలపై మునుగోడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.