Telugu Global
Telangana

Munugode Bypoll: టీఆరెస్ కు మద్దతుగా పోటీ నుంచి విరమించుకున్న 10 మంది అభ్యర్ధులు

మునుగోడు ఎన్నికల్లో టీఆరెస్ కు మద్దతుగా పది మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇంటిపార్టీ అయిన‌ టీఆర్‌ఎస్ వల్ల మాత్రమే తెలంగాణ అభివృద్ది సాధ్యమవుతుందని,బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంపడుతూ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికలను తెచ్చి ప్రజలను బలిపెడుతున్నాయని నామినాషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మండిపడ్డారు.

Munugode Bypoll: టీఆరెస్ కు మద్దతుగా పోటీ నుంచి విరమించుకున్న 10 మంది అభ్యర్ధులు
X

మునుగోడు ఉపఎన్నికల్లో నామినేషన్లు వేసిన‌ పది మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల‌ ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు.

బరినుండి వైదొలిగిన వారిలో...నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాలోత్ వెంకన్న , కేయూ జేఏసీ అధ్యక్షుడు ఆంగోత్ వినోద్ కుమార్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి తేజావత్ రవీందర్, ప్రజాసేన పార్టీ అధ్యక్షులు బానోతు ప్రేమ్ లాల్, వార్డ్ మెంబర్ భూక్య సారయ్య, నిరుద్యోగ జేఏసీ కేయూ ఇన్చార్జి భూక్య బాలాజీ , గిరిజన రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోత్ నరేందర్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు చందర్ ,జన్ను భరత్ ,జన్ను తిరుపతి తదితరులు ఉన్నారు.ఇందులో ఎక్కువమంది వరంగల్ విద్యార్థి ఉద్యమకారులే ఉండటం విశేషం.

వీరితో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చలు జరిపి ఉపసంహరణకు ఒప్పించారు. టీఆరెస్ పార్టీ పరంగా వాళ్ళకు అన్ని రకాల అండగా ఉంటామని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి తగిన గుర్తింపు గౌరవం దక్కేలా చూస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ఎర్రబల్లి చొరవతో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన ఆ పది మంది అభ్యర్థులు టీఆరెస్ గెలుపుకు తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, ఇంటిపార్టీ అయిన‌ టీఆర్‌ఎస్ వల్ల మాత్రమే తెలంగాణ అభివృద్ది సాధ్యమవుతుందన్నారు.బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంపడుతూ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికలను తెచ్చి ప్రజలను బలిపెడుతున్నాయని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఉపసంహరించుకున్న పది మంది అభ్యర్థులను అభినందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత స్వార్దం , బీజేపీ స్వార్థపూరిత రాజకీయాల వల్లనే మునుగోడు ఎన్నిక వచ్చిందని ఆయన ఆరోపించారు.

First Published:  16 Oct 2022 3:00 PM GMT
Next Story