Telugu Global
Telangana

మంత్రి పదవి నాదే..! సీతక్క భయపడ్డారా..?

అధికార పార్టీకి మద్దతిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు నాగజ్యోతి. సర్వేల్లో కూడా ఈ స్థానానికి గట్టి పోటీ ఉంటుందని తేలింది. దీంతో సీతక్కలో ఆందోళన మొదలైంది.

మంత్రి పదవి నాదే..! సీతక్క భయపడ్డారా..?
X

2018లో కాంగ్రెస్ నుంచి ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క, ఈ ఎన్నికల విషయంలో ఆందోళనపడుతున్నట్టు స్పష్టమవుతోంది. సీతక్కకి పోటీగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ బడే నాగజ్యోతిని బరిలో దింపింది. నాగజ్యోతి కూడా సీతక్కలాగే సాధారణ కుటుంబం నుంచి వచ్చినవారు. బీఆర్ఎస్ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే టికెట్ సాధించారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సీతక్క ఆస్తులు సంపాదించారే కానీ, ఆమె హయాంలో నియోజకవర్గానికి పనులేవీ కాలేదని, అధికార పార్టీకి మద్దతిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు నాగజ్యోతి. సర్వేల్లో కూడా ఈ స్థానానికి గట్టి పోటీ ఉంటుందని తేలింది. దీంతో సీతక్కలో ఆందోళన మొదలైంది.

మంత్రి అవుతా..!

ఈ సారి తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని ప్రచారంలో చెబుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు నాయిని భరత్‌ సీతక్కకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నాయకులు, ఇతర నేతలు కూడా సీతక్క తరపున ప్రచారం చేస్తున్నారు. గతంలో సీతక్క ఒంటరిగా ప్రచారం చేసేవారు, పెద్దగా హడావిడి ఉండేది కాదు, ఆమె నియోజకవర్గ పర్యటనల్లో కూడా హంగు ఆర్భాటాలు ఉండేవి కావు. కానీ ఈసారి ఆమె ప్రచారం జోరు చూస్తుంటే.. ఎక్కడో చిన్న అనుమానం ఉన్నట్టు స్పష్టమవుతోంది. అందుకే.. మంత్రినవుతా, అభివృద్ధి చేస్తానంటూ పదే పదే ఆమె తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు.

బీఆర్ఎస్ కూడా మహిళా అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంతో ఇక్కడ సీన్ మారింది. సీతక్కపై వ్యతిరేకత లేకపోయినా.. ఇక్కడ బడే నాగజ్యోతికి ఫాలోయింగ్ పెరిగింది. అందులోనూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని తేలడంతో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే.. నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందనే భావన ప్రజల్లో ఉంది. దీంతో నాగజ్యోతికి ప్రజల్లో మద్దతు పెరిగింది. సీతక్క కోసం కర్నాటక నుంచి డబ్బులొస్తున్నాయంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ములుగులో ఈసారి సీతక్క విజయం అంత ఈజీ కాదు. తాజాగా న్యూస్ ట్యాప్ సర్వేలో కూడా ఈ స్థానంలో టఫ్ ఫైట్ తప్పదని తేలింది. మొగ్గు నాగజ్యోతి వైపే ఉన్నట్టు స్పష్టమవుతోంది.

First Published:  23 Nov 2023 7:40 AM IST
Next Story