Telugu Global
Telangana

వార్తల్లో ములుగు అభ్యర్థి.. ఎన్నికల ఖర్చుకి విరాళాలు

సీతక్కకి బలమైన ప్రత్యర్థిగా నాగజ్యోతిని ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. సీతక్క లాగే సాదా సీదాగా కనపడతారు నాగజ్యోతి. హంగు, ఆర్భాటాలకు కూడా ఆమె దూరం. సీతక్కకి సరైన ప్రత్యర్థి ఆమే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

వార్తల్లో ములుగు అభ్యర్థి.. ఎన్నికల ఖర్చుకి విరాళాలు
X

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజున ములుగు అభ్యర్థిగా బడే నాగజ్యోతి వార్తల్లో వ్యక్తి అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో పేరు ప్రకటించగానే ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు, ఏడ్చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మళ్లీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు బడే నాగజ్యోతి. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆమెకు ఎన్నికల ఖర్చుకోసం తోటి నాయకులు ఆర్థిక సాయం చేయడం విశేషం. మంత్రి సత్యవతి, రెడ్కో చైర్మన్‌ సతీష్ రెడ్డి కలసి రూ.5 లక్షల రూపాయలను నాగజ్యోతికి అందించారు. అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ములుగులో ఆమె గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోపాటు, ప్రజల అభిమానం కూడా ఎప్పుడూ ఆమెకు ఉంటాయన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. తన నెల జీతం రూ. 3.5 లక్షలను ఆమెకు అందించారు. రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి కూడా తన నెల జీతం రూ. 1.5 లక్షలను నాగజ్యోతికి అందించారు.


సీతక్కపై పోటీ..

ప్రస్తుతం ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సీతక్క ఉన్నారు. ఆమెపై పోటీకి నాగజ్యోతిని రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్. సీతక్కకి బలమైన ప్రత్యర్థిగా నాగజ్యోతిని ఎంపిక చేశారు. ఇప్పటికే జడ్పీ చైర్మన్ గా ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. సీతక్క లాగే సాదా సీదాగా కనపడతారు నాగజ్యోతి. హంగు, ఆర్భాటాలకు కూడా ఆమె దూరం. సీతక్కకి సరైన ప్రత్యర్థి ఆమే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల ఖర్చులకు కూడా తోటి బీఆర్ఎస్ నాయకులు ఆమెకు విరాళాలు ఇవ్వడం విశేషం.

First Published:  22 Aug 2023 6:39 PM IST
Next Story