అభిమాన నాయకుల నామినేషన్లకు విరాళంగా పెన్షన్ డబ్బులు
తమకు కేసీఆర్ పెన్షనే ఆసరా అని, తమకు పెద్ద కొడుకులా నెల నెలా పెన్షన్ ఇచ్చి జీవనానికి భరోసాలా సీఎం నిలుస్తున్నారని చెప్పారు గ్రామస్తులు. దానికి కృతజ్ఞతగానే ఈ విరాళం అని ప్రకటించారు. వారి విరాళాల ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత తెలంగాణ పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. గ్రామాలన్నీ తమ అభిమాన నాయకులకు మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి. మండలాలకు మండలాలే ఈ తీర్మానాల కాపీలతో నాయకులను కలుస్తున్నాయి. తాజాగా ముఖరా(కే) గ్రామస్తులు మరో రూపంలో నాయకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నామినేషన్లకోసం ప్రజలు విరాళాలు సేకరించారు.
ఇదేదో డబ్బున్నోళ్ల విరాళాలు అనుకుంటే పొరపాటే. మంచి మనసున్నోళ్ల విరాళాలు అవి. తమ జీవితానికి ఆసరాగా నిలిచినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చిన విరాళాలవి. ప్రభుత్వం అందించే పెన్షన్లు తీసుకుంటున్న పేదవారు ఇలా విరాళాలిచ్చారు. ముఖరా(కే) గ్రామంలో 100 మంది పెన్షన్ దారులు తమకు ప్రభుత్వం అందించే మొత్తంలో వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చారు. అలా మొత్తం లక్ష రూపాయలు సేకరించారు. ఈ విరాళం మొత్తాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నామినేషన్ల ప్రక్రియకు ఉపయోగించాలని వారు తీర్మానించారు.
Thank You. Really touched ❤️ https://t.co/CF2zn9otXB
— KTR (@KTRBRS) August 28, 2023
తమకు కేసీఆర్ పెన్షనే ఆసరా అని, తమకు పెద్ద కొడుకులా నెల నెలా పెన్షన్ ఇచ్చి జీవనానికి భరోసాలా సీఎం నిలుస్తున్నారని చెప్పారు గ్రామస్తులు. దానికి కృతజ్ఞతగానే ఈ విరాళం అని ప్రకటించారు. వారి విరాళాల ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. వారికి థన్యవాదాలు తెలిపారు. నిజంగా తమ మనసుని ఆ సన్నివేశం హత్తుకుందన్నారు. ముఖరా(కే) గ్రామస్తుల విరాళాల ట్వీట్ ని కేటీఆర్ షేర్ చేస్తూ కామెంట్ చేశారు.