Telugu Global
Telangana

సామూహిక సెలవుల్లో ఎంపీడీవోలు, ఎంపీఈవోలు

నిధుల లేమి, పని ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడి. అదే బాటలో పంచాయతీ కార్యదర్శులు

సామూహిక సెలవుల్లో ఎంపీడీవోలు, ఎంపీఈవోలు
X

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ప్రజాపాలన ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, పాలన అస్తవ్యస్తంగా తయారైంది. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వడం లేదు.. సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది.. స్పెషల్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.. పంచాయతీ సెక్రటరీ లపై ఒత్తిడి ఎక్కువ అయ్యింది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సెక్రటరీలు సామూహిక సెలవు లో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే నిధుల లేమి, పని ఒత్తిడితో సతమతమవుతున్నామని, గ్రామ పంచాయతీల్లో సరిపడా నిధులు లేవు. ఉన్న కొద్ది నిధులను ఖర్చు చేయడానికి అవకాశం లేదంటున్నారు. దీంతో ఎలాంటి పనులు చేయలేకపోతున్నామని ఎంపీడీవోలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితికి తాము బాధ్యులం కాదని ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతోనే తాము ఏమీ చేయలేపోతున్నాం. ఎంపీడీవోలను కించపరిచేలా వ్యవహరించవద్దని, మహిళా అధికారుల గౌరవానికి భంగం కలగకుండా ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించాలంటున్నారు. ఇతర శాఖల ఉద్యోగులతో శానిటేషన్‌, ప్లాంటేషన్‌ ఆడిట్‌ చేయడం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గ్రాస్‌ కటింట్‌ మిషన్లను కొనుగోలు కమిటీల ద్వారా కొనాలంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవోలు, ఎంపీఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు సామూహిక సెలవులు పెడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు సెలవులు ఉంటామని జేడ్పీ సీఈవోలకు నోటీసుల్లో పేర్కొంటున్నారు.

అదే బాటలో పంచాయతీ కార్యదర్శులు

అదే బాటలో పంచాయతీ కార్యదర్శులున్నారు. ఒకవైపు నిధుల సమస్య మరోవైపు పాలకవర్గం లేకపోవడంతో నిధుల సమస్య ప్రధానంగా ఉన్నది. పాలకవర్గం లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి పెరుగుతున్నది. ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోవడంతో తమ పరిస్థితి ముందు నుయ్యి లా తయారైందంటున్నారు. ప్రత్యేక అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు. కనీసం మైంటెనెన్సు కు నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదంటున్నారు. దీనికి జిల్లా అధికారులు ఆడిట్‌లు, ఎంక్వయిరీలు అంటూ సస్పెండ్‌ చేస్తుండటం తమను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నదని పంచాయతీ కార్యదర్శల జేఏసీ ఎంపీడీవోలకు, జిల్లా అదనపు కలెక్టర్లకు నోటీసులు అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది..

ప్రధాన ప్రతిపక్షం చెప్పినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు

తమ హయాంలో సమాయానికి నిధులు విడుదల చేశామని, ప్రస్తుత రేవంత్‌ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు కొన్నిరోజులుగా ప్రెస్‌మీట్‌లో పెట్టి చెబుతున్నారు. నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయని, ఫలితంగా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారుప్రధాన ప్రతిపక్షం ఎన్నిసార్లు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఎంపీడీవోలు, ఎంపీఈవోలతో పాటు పంచాయతీ కార్యదర్శలు సామూహిక సెలవులు పెట్టి వెళ్తున్నారు.

First Published:  27 Sept 2024 1:42 PM IST
Next Story