Telugu Global
Telangana

ఎంపీ హ్యాండిచ్చినట్లేనా ?

సొంతపార్టీ అభ్యర్ధి గెలుపున‌కు పనిచేస్తే ఆటోమేటిగ్గా తమ్ముడి ఓటమికి పనిచేసినట్లే అవుతుంది. అలాగని కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ తరఫున పోటీచేస్తున్న తమ్ముడి విజ‌యం కోసం సహకరించలేరు.

ఎంపీ హ్యాండిచ్చినట్లేనా ?
X

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున గేమ్ ఛేంజర్ అని ప్రచారంలో ఉన్న భువనగిరి ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి పెద్ద హ్యాండిచ్చినట్లేనా ?. అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డేమో కాంగ్రెస్ ఎంపీ. ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డేమో స్వయానా తమ్ముడు. ఎంతైనా `బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్` అని అంటారు కదా. ఈ పద్ధ‌తిలోనే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపున‌కు పనిచేయాలని ఎంపీ అనుకోలేదట.

సొంతపార్టీ అభ్యర్ధి గెలుపున‌కు పనిచేస్తే ఆటోమేటిగ్గా తమ్ముడి ఓటమికి పనిచేసినట్లే అవుతుంది. అలాగని కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ తరఫున పోటీచేస్తున్న తమ్ముడి విజ‌యం కోసం సహకరించలేరు. ఎందుకంటే ఎంపీ ప్రతి కదలికను పార్టీ నేతలు డేగకళ్ళతో గమనిస్తున్నారు. అందుకనే ఈ తలనొప్పులన్నీ ఎందుకని ఏకంగా దేశంలోనే ఉండకూడదని అనుకున్నారట. ఈనెల 15వ తేదీన కుటుంబంతో కలిసి ఎంపీ ఆస్ట్రేలియాకు వెళ్ళబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

15వ తేదీన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళుతున్న ఎంపీ మళ్ళీ ఎన్నికలయ్యాకే తిరిగి వస్తారట. పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నిక జరుగుతుంటే దగ్గరుండి గెలిపించుకోవాల్సిన వెంకటరెడ్డి విదేశానికి వెళిపోతున్నారంటేనే ఉద్దేశ్యం ఏమిటో అర్థ‌మైపోతోంది. సొంతపార్టీ అభ్యర్థి ఓడిపోయి తన తమ్ముడు గెలవాలన్నదే ఎంపీ ఉద్దేశ్యమని తెలిసిపోతోంది. స్రవంతికి టికెట్ ఇస్తే తాను గెలిపిస్తానని అధిష్టానంతో ఎంపీ గట్టిగా పట్టుబడితేనే ఆమెకు టికెట్ దక్కిందని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.

పట్టుబట్టి టికెట్ ఇప్పించుకుని ఎన్నికప్రక్రియలో పాల్గొనకుండా ఆస్ట్రేలియాకు వెళ్లిపోవటం ఏమిటని నేతలు మండిపడుతున్నారు. ఎంపీ వరస చూస్తుంటే ఏదోరోజు ఈయన కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లిపోవటం ఖాయమనే టాక్ పార్టీలో పెరిగిపోతోంది. జరుగుతున్నదంతా చూస్తుంటే తన తమ్ముడి గెలుపు కోసమే కాంగ్రెస్ అభ్యర్థిగా పట్టుబట్టి బలహీనమైన స్రవంతికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  11 Oct 2022 7:20 AM IST
Next Story