తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్!
ప్రస్తుతం బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఉన్న కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంతో ఆయన స్థానంలో ఈటలకు బాధ్యతలు అప్పజెప్పుతారని తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఈటల రాజేందర్‌కు పార్టీ హైకమాండ్ హింట్ ఇచ్చినట్లు సమాచారం. అమిత్ షా పిలుపుతో ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు ఈటల. అమిత్ షా తో సమావేశమయ్యారు. అనంతరం అస్సాం సీఎం హిమాంత బిశ్వా శర్మతోనూ అరగంటకుపైగా చర్చలు జరిపారు.
ప్రస్తుతం బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఉన్న కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంతో ఆయన స్థానంలో ఈటలకు బాధ్యతలు అప్పజెప్పుతారని తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
తెలంగాణలో బీసీల్లో బలమైన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్.. ఇటీవల ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల.. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగానూ సేవలందించారు.