ఇక హైడ్రాకి మరిన్ని అధికారాలు
హైడ్రాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. హైడ్రాను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది.
BY Vamshi Kotas16 Oct 2024 8:10 PM IST
X
Vamshi Kotas Updated On: 16 Oct 2024 8:10 PM IST
తెలంగాణ హైకోర్టులో హైడ్రాకు భారీ ఊరట లభించింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని కోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో నెంబర్.99, హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు మొదలైన పబ్లిక్ ఆస్తలు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికి హైడ్రాకి అధికారం ఇచ్చిన ప్రభుత్వం.
ఒకవేళ చట్టవిరుద్ధంగా ప్రైవేటు ఆస్తుల్లోకి చొరబడినా, ఆస్తులను కూల్చివేసినా నష్టపరిహారం కోరుతూ కింది కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా కూల్చివేతలకు సంబంధించి చట్టప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఇదే హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
Next Story