Telugu Global
Telangana

వానాకాలం సీజన్: రికార్డు స్థాయిలో 64.30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన తెలంగాణ ప్రభుత్వం

ఈ సీజన్‌లో 7,024 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ కేంద్రాల ద్వారా 9.76 లక్షల మంది రైతుల నుంచి వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే రైతుల ఖాతాలో 12,700 కోట్ల రూపాయలు జమ చేశామని, మిగిలిన మొత్తాన్ని వారం రోజుల్లో జమ చేస్తామని మంత్రి కమలాకర్ తెలిపారు.

వానాకాలం సీజన్: రికార్డు స్థాయిలో 64.30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన తెలంగాణ ప్రభుత్వం
X

2022-23 వానాకాలం సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 9.76 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో రూ.13,750 కోట్ల విలువైన 64.30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది.

వానాకాలం కొనుగోళ్లు గతేడాది అక్టోబర్ 21న ప్రారంభమై ఈ శనివారానికి విజయవంతంగా పూర్తయ్యాయి. రైతుల వద్ద నిల్వలు మిగిలి ఉంటే వాటిని కూడా మంగళవారం వరకు కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి జి కమలాకర్‌ శనివారం తెలిపారు.

కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మారుమూల ప్రాంతాల రైతుల కోసం వారి సమీప ప్రాంతాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

ఈ సీజన్‌లో 7,024 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ కేంద్రాల ద్వారా 9.76 లక్షల మంది రైతుల నుంచి వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే రైతుల ఖాతాలో 12,700 కోట్ల రూపాయలు జమ చేశామని, మిగిలిన మొత్తాన్ని వారం రోజుల్లో జమ చేస్తామని కమలాకర్ తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల కోసం 16 కోట్ల బస్తాలను ముందుగానే ఏర్పాటు చేయడం వల్ల ఈ సారి బ్యాగుల సమస్య రాలేదన్నారు. ఇంకా అవసరమైతే మరో 5.5 కోట్ల బస్తాలు కూడా ఏర్పాటు చేశామన్నారు.

వానాకాలం సీజన్‌లో కాస్త ఆలస్యంగా పంటలు సాగు చేసిన వారు మంగళవారం వరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

2014-15లో వానకాలం సీజన్‌లో 11.04 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ సీజన్‌లో కొనుగోళ్ళు 64.30 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగాయి.

అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా నుంచి 5.86 లక్షల మెట్రిక్‌ టన్నులు, కామారెడ్డి నుంచి 4.75 లక్షల మెట్రిక్‌ టన్నులు, నల్గొండ నుంచి 4.13 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోళ్లు జరిగాయి

First Published:  22 Jan 2023 6:24 AM IST
Next Story