Telugu Global
Telangana

అమిత్ షానే ఆది గురువు.. పార్ట్-9లో కీలక సమాచారం

మొయినాబాద్ ఫార్మ్ హౌజ్ వ్యవహారంలో బైటపడ్డ వీడియోల్లోని పార్ట్-9లో అమిత్ షా గురించిన ప్రస్తావన ఉంది. అదే రోజు అమిత్ షా కి ఫోన్ కలసినా, లేదా సంతోష్ కి అమిత్ షా అందుబాటులోకి వచ్చినా వ్యవహారం మరో రకంగా ఉండేది.

అమిత్ షానే ఆది గురువు.. పార్ట్-9లో కీలక సమాచారం
X

ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్ లను సీఎం కేసీఆర్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల డీజీపీలకు, హైకోర్టులకు ఈ వీడియోలను పంపిస్తున్నామని చెప్పారాయన. అనేక భాగాలుగా ఉన్న ఈ ఆధారాల్లో పార్ట్-9లో అమిత్ షా గురించిన ప్రస్తావన ఉంది. అమిత్ షా అన్నీ చూసుకుంటారని, ఆయన అందుబాటులోకి వస్తే పని పూర్తవుతుందని రామచంద్రభారతి చెప్పారు.

ఎమ్మెల్యేలతో ముగ్గురు రాయబారుల సంభాషణ ఇలా సాగింది..

ఎమ్మెల్యే బాలరాజు: ఏకంగా ప్రధానే.. సంతోష్ దగ్గరికి వస్తాడంటే మేము ఎలా నమ్మాలి?

సింహయాజి: నేను చెప్పేది వినండి. పార్టీలో ఎలా ఉంటుందంటే.. సంతోష్ నే ఇక్కడికి రమ్మని మొత్తం సెటిల్ చేసుకొని.. అప్పుడు ఢిల్లీ వెళ్లి అక్కడ జాయిన్ అయితే బెటర్.

ఎమ్మెల్యే బాలరాజు: మా ఉద్దేశం ఏంటంటే..? అక్కడ, ఇక్కడ కాకుండా అయిపోతున్నాం అని! ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఉంటుంది.

సింహయాజి: మహారాష్ట్రలో ఇంటెలి జెన్స్ లేదా, అక్కడ చేశాం కదా, వాళ్లకు రాడార్స్ కూడా ఉంటాయి, కానీ పని అయింది కదా..

రామచంద్రభారతి: అమిత్ షా అందుబాటులోకి రావడం లేదు. అదే ప్రధాన సమస్య. మొదటి డెలివరీ గురించి.. సంతోష్, అమిత్ షా తో మాట్లాడుతున్నాను. సంతోష్, అమిత్ షా తో మీటింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. నేనుకూడా కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాను. రేపు ఉదయం 10 గంటలకు.. మా ఇంట్లో అమిత్ షా తో సమావేశం ఉంది. కాబట్టి నేను అక్కడ ఉదయం 8 గంటల లోపు ఉండాలి.

సింహయాజి: మమ్మల్నెవరూ గుర్తుపట్టరు.

రామచంద్రభారతి: నా ఒక్క స్పీచ్ కు లక్ష రూపాయలు తీసుకుంటాను.

(ఇంతలో రాజాసింగ్ గురించి ప్రస్తావన..)

ఎమ్మెల్యే బాలరాజు: రాజాసింగ్ గురించి ఏమంటారు?

రామచంద్రభారతి: అతన్ని వదిలేయండి.

నందకుమార్: ఆయనది ఏమీ ఉండదు. అంతా పంచాయితీనే

రామచంద్రభారతి: ఆయనకు ఒక టాస్క్ ఉంది. మనకు అనుచరులు ఉన్నంత వరకు ఏమీ కాదు, ఒకవేళ లేకపోతే మనం బాధితులం అవుతాం.

ఇలా సాగింది వీరి సంభాషణ. అదే రోజు అమిత్ షా కి ఫోన్ కలసినా, లేదా సంతోష్ కి అమిత్ షా అందుబాటులోకి వచ్చినా వ్యవహారంలో కదలిక వచ్చేది. ఫస్ట్ పేమెంట్ గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడుకున్నారు. కానీ ఎక్కడా ఆ ముగ్గురూ పెద్ద నేతలతో టచ్ లోకి వెళ్లలేకపోయారు. పోలీసు కోర్టుకి సమర్పించిన ఆధారాల్లో మాత్రం అమిత్ షా తో వారు చేసిన వాట్సప్ చాటింగ్ ఉంది.

మొత్తమ్మీద మహారాష్ట్రలో శివసేన చీలిక ఎపిసోడ్ లో కూడా అమిత్ షాదే ప్రముఖ హస్తం అని తేలిపోయింది. కేంద్ర హోంశాఖ అధికారాలను ఉపయోగించుకుని మహారాష్ట్రలో వ్యవహారం చక్కబెట్టారు. తెలంగాణలో కూడా అలాగే ఎమ్మెల్యేలను లొంగదీసుకోవాలనుకున్నారు. కానీ ఇక్కడ వ్యవహారం తేడా కొట్టింది. బీజేపీ పన్నాగం సాక్ష్యాధారాలతో సహా బయటపడింది.

First Published:  4 Nov 2022 12:31 PM IST
Next Story