జర్నలిస్ట్ దాడి ఘటనపై ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు
జర్నలిస్ట్ దాడి ఘటనపై నటుడు మోహన్ బాబు 11 నిమిషాల నిడివి గలఆడియోను విడుదల చేశారు.
హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నటుడు మోహన్ బాబు 11 నిమిషాల ఆడియోను విడుదల చేశారు. ఫ్యామిలీ సమస్యల్లో ఎవరైన జోక్యం చేసుకోవచ్చా ప్రజలు, రాజకీయ నాయకులు దీని ఆలోంచిచాలి అని పేర్కొన్నారు. జర్నలిస్ట్‌పై కావాలని దాడి చేయలేదు. నా ఇంట్లోకి దూసుకోచ్చేవాళ్లు అసలు అతను నిజంగా జర్నలిస్టా? కాదా? అని నాకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. కొట్టడం తప్పైనప్పటికీ ఏ సందర్భంలో కొట్టానో చూడాలన్నారు. కానీ మీరు ఈ విషయాలు చెప్పడం లేదన్నారు. పైన భగవంతుడు చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రజలతో పాటు రాజకీయ నాయకులు ఆలోచించాలి. కుటుంబ సమస్యలు అందరికి ఉంటాయి. మేం నటులం కాబట్టి కొంతమంది ఉన్నవి లేనివి వార్తల్లో చెబుతుంటారు. ఇలా వార్తలు చదివేవారు కూడా ఆలోచించాలి. వారి ఇంట్లో కుటుంబ సమస్యలు వస్తే ఇలానే బయటకు చెబుతున్నారా అని ఆలోచించుకోండి అంటూ మోహన్ బాబు అన్నారు.