జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పిన మోహన్ బాబు
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు మరోసారి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు.
BY Vamshi Kotas15 Dec 2024 5:02 PM IST
X
Vamshi Kotas Updated On: 15 Dec 2024 5:03 PM IST
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు మరోసారి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆయన దాడిలో గాయాలపాలై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను ఇవాళ మోహన్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా రంజిత్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇదిలా ఉండగా.. మోహన్ బాబు, మంచు మనోజ్‌కు మధ్య జరిగిన వివాదం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.
మంచు ఫ్యామిలీ గొడవలను కవర్ చేసేందుకు డిసెంబర్ 10న మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో రజింత్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అలాగే మోహన్ బాబు దాడి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.'''
Next Story