బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాల పట్ల మోడీ మౌనం.... కేటీఆర్ ఆగ్రహం
బీజేపీ నాయకులు ఒక మతంపై ద్వేష పూరితంగా దాడి చేస్తూ ఉంటే మోడీ చెవిటివాడి లాగా మౌనంగా ఉండి వారి మాటలకు అనుమతి ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ట్వీట్టర్ లో షేర్ చేశారు.
బీజెపి ఎంపీలు, నాయకులు ద్వేష పూరిత ప్రసంగాలు చేస్తూ ఉంటే, ఒక మతాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తూ ఉంటే, వారిని బహిష్కరించమని పిలుపులు ఇస్తూ ఉంటే ప్రధాని మోడీ చూస్తూ, వింటు కూడా మౌనంగా ఉండటాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ట్వీట్టర్ లో షేర్ చేశారు.
ఒక మతస్తులను బహిష్కరించాలని, వారి వ్యాపారాలను బహిష్కరించాలని బీజేపీ ఎంపీ వర్మ మాట్లాడగా, గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడని మరో ఎంపీ ప్రాగ్యా ఠాకూర్ మాట్లాడారు. మరో ఎంపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయేమో మసీదులను తవ్వండి, శివుడొస్తే మాకు, శవమొస్తే వాళ్ళకు అప్పగించండి అంటూ రెచ్చగొడుతూ మాట్లాడాడు. బిల్కిస్ బానో రేపిస్టులు సంస్కారులు అని మరి కొందరు బీజేపీ నేతలు రేపిస్టులకు సరిఫికెట్లు ఇచ్చారు. ఈ విషయాలపై స్పందించిన కేటీఆర్ ఈ బీజేపీ నాయకుల మాటల పట్ల మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
మోడీ చెవిటివాడి లాగా మౌనంగా ఉండి వారి మాటలకు అనుమతి ఇస్తున్నారని ఆరోపించిన కేటీఆర్ ''మోడీజీ, దేనినైతే మీరు అనుమతి ఇస్తున్నారో దానినే మీరు ప్రచారం చేస్తున్నారు'' అని మండిపడ్డారు.
Is this acceptable?
— KTR (@KTRTRS) October 11, 2022
"Boycott a community"
"Godse is a patriot"
"Lets Dig up Mosques"
" Bilkis Bano Rapists are Sanskari"
All these hideous statements from BJP lawmakers & PM's deafening silence is astonishing
Remember Modi Ji, what you permit is what you promote pic.twitter.com/5CmH9y4H1m