మోడీ గారూ, ఈ ఫ్లై ఓవర్ ఇంకా ఎన్నేళ్ళు కడతారు ? ...హైదరాబాద్ లో పోస్టర్లు
5 ఏళ్ళుగా పనులు సాగుతున్న ఉప్పల్ , నారాపల్లి ఫ్లై ఓవర్ స్థంభాలపై 'ఈ ఫ్లై ఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు?' అని మోడీని ప్రశ్నిస్తూ పోస్టర్లు వెలిశాయి.
ఉప్పల్-నారపల్లి మధ్య కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ళ క్రితం మొదలు పెట్టిన ఫ్లై ఓవర్ పనులు ఇంకా 40 శాతం కూడా పూర్తి కాకపోవడంతో ఆ ప్రాంతంలో రోజూ ప్రయాణించే వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే విషయం పై రెండురోజుల క్రితం ఓ నెటిజన్ ట్వీట్టర్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు కూడా.
రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్తిన ఫ్లైఓవర్ లన్ని పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఆ ఫ్లై ఓవర్ ఇంకా పూర్తి కాలేదని అదే మోడి కి, కేసీఆర్ కు తేడా అని కేటీఆర్ ఆ నెటిజన్ కు జవాబు కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అసంపూర్తిగా ఉన్న ఆ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోడిని ప్రశ్నిస్తూ ఈ రోజు పోస్టర్లు వెలిశాయి. మోడీ ఫోటోలతో కూడిన ఆ పోస్టర్లలో...
''మోడీ గారూ...ఈ ఫ్లై ఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు?
పని ప్రారంభం 05మే ,2018
5ఏండ్లు అయినా ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ 40% కూడా పూర్తి కాలేదు '' అని ప్రింట్ చేశారు.
మరి ఈ పోస్టర్లు చూసైనా కేంద్రం ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తుందని ఆశించవచ్చా ?.
ఇదీ బీజేపీ కేంద్ర ప్రభుత్వ పనితీరు...
— BRS Party (@BRSparty) March 28, 2023
మొదలు పెట్టి 5 ఏండ్లు అయినా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఉప్పల్ - నారపల్లి ఫ్లైఓవర్ పనులు 40% కూడా పూర్తి కాలేదని ప్రధాని మోడీని నిలదీస్తున్న హైదరాబాదీలు. pic.twitter.com/Mlyy6W9mtC