Telugu Global
Telangana

కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారా..? మోదీ మాటల మర్మమేంటి..?

ఎక్కడో భోపాల్ లో జరిగిన మీటింగ్ లో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం గురించి ఎందుకు ప్రస్తావించారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారా..? మోదీ మాటల మర్మమేంటి..?
X

మధ్యప్రదేశ్ లో 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ, భోపాల్ మీటింగ్ లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బాలన అంటూ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. కేసీఆర్ వి కుటుంబ రాజకీయాలని విమర్శించారు మోదీ.

సంబంధం ఏంటి..?

ఎక్కడో భోపాల్ లో జరిగిన మీటింగ్ లో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం గురించి ఎందుకు ప్రస్తావించారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లో ఎన్నికల తాయిలాల పంపిణీకి వచ్చిన మోదీ, కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడటం, స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులకు కూడా విచిత్రంగా తోచింది. పోనీ మధ్యప్రదేశ్ లో బీఆర్ఎస్ విస్తరణకు ప్లాన్ చేస్తున్నారా అంటే, ప్రస్తుతానికి మహారాష్ట్రపైనే కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. అకారణంగా భోపాల్ లో కేసీఆర్ ప్రస్తావన తెచ్చిన మోదీ, తన వ్యాఖ్యలతో కలకలం రేపారు.


మొన్న నడ్డా, నేడు మోదీ..

ఇటీవల తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కేసీఆర్ ని టార్గెట్ చేశారు. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే నడ్డాకు వెంటనే బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు కూడా అదే స్థాయిలో పడ్డాయి. కేసీఆర్ ని తూలనాడినవారు రాజకీయాల్లో దారుణంగా దెబ్బతిన్నారని అన్నారు మంత్రి కేటీఆర్. తాజాగా మోదీ కూడా కేసీఆర్ ని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ భోపాల్ నుంచి కౌంటర్లు వేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రియాక్షన్లు ఎలా ఉంటాయి చూడాలి.

First Published:  27 Jun 2023 4:13 PM IST
Next Story