ఈ నెల 18 వరకు తెలంగాణలో మోస్తరు వర్షాలు
ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు
BY Raju Asari15 Oct 2024 12:18 PM IST

X
Raju Asari Updated On: 15 Oct 2024 12:18 PM IST
అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి ఈనెల 18వరకు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు నిర్మల్, హైదరాబాద్ జిల్లాకు వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం పడింది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, తార్నాక, లాలాపేట్, నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్, బహదూర్‌పల్లి, సూరారంలో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Next Story