రేవంత్‌పై కేసు పెట్టాలి..లేదంటే - కవిత వార్నింగ్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బాల్క సుమన్‌పై కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టారు కవిత. దళిత బిడ్డ బాల్క సుమన్‌పై FIR నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అసభ్యపదజాలాన్ని ఉపయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. లేదంటే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కవిత.. తెలంగాణ డీజీపీని తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. సూర్యుడిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మరిచిపోవద్దని రేవంత్‌కు సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.…
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బాల్క సుమన్‌పై కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టారు కవిత. దళిత బిడ్డ బాల్క సుమన్‌పై FIR నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే ఇవాళ తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభిస్తోందన్నారు. ఇది రాచరిక వ్యవస్థను తలపిస్తోందన్నారు కవిత.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ బాల్క సుమన్.. చెప్పుతో కొడతామంటూ కామెంట్ చేశారు. దీంతో ఆయనపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.