Telugu Global
Telangana

ఆక్స్ ఫర్డ్ లో నేడు ఎమ్మెల్సీ కవిత ప్రసంగం..

ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమం కోసం లండన్‌ లో పర్యటించిన కవిత అక్కడి విద్యార్థులతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఆమె ద్వారా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే.. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రత్యేక ఆహ్వానం పంపింది.

ఆక్స్ ఫర్డ్ లో నేడు ఎమ్మెల్సీ కవిత ప్రసంగం..
X

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో నేడు ఎమ్మెల్సీ కవిత కీలక ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. ‘ఎక్స్‌ ప్లోరింగ్‌ ఇన్‌ క్లూసివ్‌ డెవలప్‌ మెంట్‌-ది తెలంగాణ మోడల్‌’ అనే అంశంపై ఆమె ప్రసంగించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ముందు ఉన్న పరిస్థితులు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించి అభివృద్ధి సాధించిన తీరుని అంతర్జాతీయ వేదికపై వివరిస్తారు కవిత. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు కవిత ఆదివారం బ్రిటన్ బయలుదేరి వెళ్లారు.

ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమం కోసం లండన్‌ లో పర్యటించిన కవిత అక్కడి విద్యార్థులతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఆమె ద్వారా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే.. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రత్యేక ఆహ్వానం పంపింది. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ పై ప్రసంగించాలని కోరింది. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పన గురించి అంతర్జాతీయ వేదికపై కవిత ప్రసంగించబోతున్నారు. ఆయా పథకాల అమలుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పడమే కాకుండా.. సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపమే తెలంగాణ అభివృద్ధి అని అంతర్జాతీయ వేదికపై కవిత చాటి చెప్పబోతున్నారు.

తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతుబంధు పేరుతో అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగిస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి ఆమె వివరిస్తారు. మిషన్ భగీరథ సహా.. వైద్య, విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్శిటీలో కవిత ప్రసంగిస్తారు. గతంలో కూడా పలు అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ అభివృద్ధిని ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఆయా సంస్థల ఆహ్వానం మేరకు వివిధ సదస్సుల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ వేదికగా తెలంగాణ అభివృద్ధి ఘనతను వివరించబోతున్నారు.

First Published:  30 Oct 2023 2:35 AM GMT
Next Story