క్రికెట్ లో కోహ్లీకి తిరుగులేదు.. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురులేదు..
కేసీఆర్ లాగే కోహ్లీ కూడా ఎదురులేని వ్యక్తి అన్నారు. మాస్టర్స్ ఫీల్డ్ లో ఉంటే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయన్నారు కవిత.
క్రికెట్ ఫీవర్ నిన్న అందర్నీ ఊపేసింది. ఓవైపు పొలిటికల్ ఫైట్ లో బిజీగా ఉన్నా.. సెమీఫైనల్లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ని ఫాలో అయ్యారు తెలంగాణ నాయకులంతా. సెమీస్ లో కోహ్లీ రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చతురతను కోహ్లీ ఆటతీరుని పోలుస్తూ ట్వీట్ వేశారు ఎమ్మెల్సీ కవిత. క్రికెట్ లో కోహ్లీకి తిరుగులేదు.. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురులేదు.. అని అన్నారు. కేసీఆర్ లాగే కోహ్లీ కూడా ఎదురులేని వ్యక్తి అన్నారు. మాస్టర్స్ ఫీల్డ్ లో ఉంటే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయన్నారు కవిత.
Just like CM KCR, Virat Kohli is unbeatable! When the masters are in the field, magic happens! #KCROnceAgain #VoteForCar#JaiTelangana pic.twitter.com/C2BFJrp6xP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 15, 2023
సెమీఫైనల్లో భారత్ విక్టరీపై కూడా కవిత ట్వీట్ వేశారు. ఇన్ క్రెడిబుల్ విక్టరీ అంటూ టీమిండియాకి శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్లోకి సగర్వంగా టీమిండియా అడుగుపెట్టిందని, వరల్డ్ కప్ ని గెలిచి మరోసారి ఆ ఘనత సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
నిన్నంతా బాల్కొండ నియోజకవర్గ పర్యటనలో బిజీబిజీగా గడిపారు ఎమ్మెల్సీ కవిత. బాల్కొండలో బీఆర్ఎస్ శ్రేణుల ఉత్సాహం చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దేఖ్ లేంగే పాటకు కాలుకదిపారు. కేవలం ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోరుకుంటాయని, బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజలు గెలవాలని, ప్రజల బతుకులు బాగుపడాలని కోరుకుంటుందన్నారు. బాల్కొండను బంగారుకొండలా అభివృద్ధి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకుందామని రోడ్ షో లో ప్రజలకు పిలుపునిచ్చారు కవిత.