కుటుంబ సభ్యుల వద్ద కవిత భావోద్వేగం
ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కేటీఆర్ కి కవిత రాఖీ కట్టారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కేటీఆర్ స్వయంగా కవితకు స్వీట్ తినిపించారు.
దాదాపు 5 నెలల తర్వాత హైదరాబాద్ లో కుటుంబ సభ్యులను చూసిన కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎయిర్ పోర్ట్ లో ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలుకగా ఇంటి వద్ద కుటుంబ సభ్యులు హారతులిచ్చి లోనికి తీసుకెళ్లారు. తల్లిని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు కవిత, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. వదినమ్మని ఆలింగనం చేసుకున్నారు, చిన్నారులను హత్తుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, కుటుంబ సభ్యులతో ఆ ఇంటిలో పండగ వాతావరణం నెలకొంది.
తల్లి శోభమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనైన ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/970ySyJoRa
— BRS Party (@BRSparty) August 28, 2024
నేడే రాఖీ పండగ..
ఇటీవల రాఖీ పండగ జరుపుకునే సందర్భంలో తన సోదరి తనతో లేదనే బాధ కేటీఆర్ లో కనిపించింది. ఈరోజు వారి ఇంటిలో అసలైన రాఖీ పండగ సంబరాలు జరిగాయి. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కేటీఆర్ కి కవిత రాఖీ కట్టారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కేటీఆర్ స్వయంగా కవితకు స్వీట్ తినిపించారు.
తన ఇంటికి చేరుకున్న అనంతరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అన్న @KTRBRS గారికి రాఖీ కట్టిన ఎమ్మెల్సీ @RaoKavitha. pic.twitter.com/zqBdHqhHdm
— BRS Party (@BRSparty) August 28, 2024
కడిగిన ముత్యంలా అపవాదులన్నీ దాటుకుని బయటకొస్తానని చెప్పారు కవిత. తానెప్పుడూ ఏ తప్పూ చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటాల్లో తాను పాల్గొంటానని అన్నారు కవిత. ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. కష్టకాలంలో తమకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Live: BRS Working President @KTRBRS and MLC @RaoKavitha addressing the Media in Hyderabad. https://t.co/p1F2dOtcat
— BRS Party (@BRSparty) August 28, 2024