Telugu Global
Telangana

బ్రిస్బేన్ లో బోనం.. ఆస్ట్రేలియాలో తెలంగాణ సంప్రదాయం

భారత సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాలను ఆస్ట్రేలియాకి విస్తరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కవిత. విదేశాల్లో కూడా మన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు తెలంగాణ కుటుంబాలను ఆమె అభినందించారు.

బ్రిస్బేన్ లో బోనం.. ఆస్ట్రేలియాలో తెలంగాణ సంప్రదాయం
X

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జరిగిన బోనాల ఉత్సవాల్లో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అక్కడ స్థిరపడి నతెలంగాణ ఆడపడుచులతో కలసి ఆమె బోనమెత్తారు. స్థానిక దేవాలయాలకు బోనాలు తీసుకెళ్లి సమర్పించారు. భారత సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాలను ఆస్ట్రేలియా దేశానికి విస్తరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విదేశాల్లో కూడా మన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు తెలంగాణ కుటుంబాలను ఆమె అభినందించారు.


అభివృద్ధి పథంలో తెలంగాణ..

తొమ్మిదేళ్లలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర ప్రభుత్వం సంపదను పెంచి నిరుపేదలకు పంచుతోందన్నారు. జీఎస్డీపీలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు ఎకువగా ఉందని గుర్తు చేశారు. దాదాపు అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌-1 గా నిలిచిందని తెలిపారు. దేశంలో కొత్తగా భర్తీ అయ్యే ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచి ఉంటోందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ రంగంలో తెలంగాణలో 3.5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 9.5 లక్షలకు చేరాయని తెలిపారు కవిత.

అభివృద్ధిలో భాగస్వాములు కండి..

సొంత రాష్ట్రం అభివృద్ధిలో కూడా ప్రవాసులు భాగస్వాములు కావాలని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు కవిత. భారత్‌ లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని, తొమ్మిదేళ్లలో 47 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు.

First Published:  16 July 2023 7:18 AM IST
Next Story