Telugu Global
Telangana

పెన్షన్ల టెన్షన్ లేని జీవితాలను ఇబ్బంది పెట్టుకుంటారా..?

ప్రతి మండలానికి 50లక్షల రూపాయలతో ఫిష్ మార్కెట్ కట్టిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. చెరువు లేని చోట్ల చెక్ డ్యామ్ లు కట్టి అక్కడ చేపలు పట్టుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

పెన్షన్ల టెన్షన్ లేని జీవితాలను ఇబ్బంది పెట్టుకుంటారా..?
X

సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని, పథకాలతో ప్రజలు గౌరవంగా బతుకుతున్నారని, పెన్షన్ల టెన్షన్ లేనే లేదని, పైగా బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే పెన్షన్లు పెరుగుతాయని.. ఇలాంటి జీవితాలను ఇబ్బంది పెట్టుకోవద్దని సూచించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాకముందు, కేసీఆర్ సీఎం కాకముందు మన పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో.. ఒక్కసారి బేరీజు వేసుకోవాలన్నారు. గంగపుత్రులు చాలా పేదరికంతో ఉండేవారని, వారి జీవితాల్లో మార్పు తేవాలని తెలంగాణ ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ ఆలోచించారని చెప్పారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని, మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగారని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో జరిగిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.


ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇతర పార్టీలు వచ్చి మాటలు చెబుతున్నాయని, ఆ మాటలను నమ్మి తప్పు వైపు వెళ్తే ఇప్పటి వరకు చేసుకున్న కుప్ప మొత్తం చిత్తిపోతుందని తెలిపారు కవిత. పట్టు విడవకుండా పోరాడి సీఎం కేసీఆర్ తెలంగాణను తెచ్చారని, తెచ్చిన తెలంగాణను పచ్చబడేలా చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ప్రజలు తప్పు చేయొద్దని సూచించారు. బీఆర్ఎస్ పాలన వస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు కవిత.

ప్రతి మండలానికి 50లక్షల రూపాయలతో ఫిష్ మార్కెట్ కట్టిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. చెరువు లేని చోట్ల చెక్ డ్యామ్ లు కట్టి అక్కడ చేపలు పట్టుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గంగపుత్రులకోసం ప్రతి మండల కేంద్రంలో సంఘ భవనం కట్టించే ప్రయత్నం చేస్తామన్నారు. మత్స్యకారుల పిల్లలు వేరే వ్యాపారాలు చేస్తామంటే.. వారికి బీసీబంధు ద్వారా సాయం చేస్తామని చెప్పారు.

First Published:  23 Nov 2023 7:53 PM IST
Next Story