Telugu Global
Telangana

మహిళా సాధికారతకోసం కలసి పనిచేద్దాం - కవిత

మహిళలు నింగిలో సగం, నేలలో సగం, జనాభాలో సగం. కానీ చట్టసభల్లో మాత్రం 33 శాతం కూడా రిజర్వేషన్లు లేవు అని చెప్పారు కవిత. రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు.

మహిళా సాధికారతకోసం కలసి పనిచేద్దాం - కవిత
X

పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. ట్విట్టర్లో ఓ వీడియో విడుదల చేశారు. మనమేమీ ఎక్కువ కోరడం లేదని 33 శాతం రిజర్వేషన్లు అడుగుతున్నామని చెప్పారు. మహిళలు అడ్డంకులను ఛేదించి తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మహిళా సాధికారత కోసం కలిసి పనిచేద్దామంటూ పిలుపు నిచ్చారు.

మహిళలు నింగిలో సగం, నేలలో సగం, జనాభాలో సగం. కానీ చట్టసభల్లో మాత్రం 33 శాతం కూడా రిజర్వేషన్లు లేవు అని చెప్పారు కవిత. రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఉగాది రోజున ఆమె తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించిన వీడియోని ట్విట్టర్లో విడుదల చేశారు. #WomenReservationBill #MorePowerToWomen అనే హ్యాష్ ట్యాగ్ లు జత చేశారు.


ఓవైపు కవిత మహిళా రిజర్వేషన్లకోసం పోరాటం చేస్తుంటే, మరోవైపు కేంద్రం ఈడీ విచారణల పేరుతో వేధింపులు ఎక్కువ చేసింది. అయితే కవిత తగ్గేదే లేదంటున్నారు. ఢిల్లీలో విపక్ష పార్టీలతో కలసి మహిళా సాధికారతకోసం నిరాహార దీక్ష చేశారు. కేంద్రానికి వణుకు పుట్టించారు. విపక్షాల ఐక్యత చూసిన కేంద్రం కవితపై మరింత ఫోకస్ పెంచింది. ఈడీ విచారణ పేరుతో పదే పదే ఆమెను ఇబ్బంది పెడుతోంది. బీఆర్ఎస్ నేతలు ఈ విచారణలపై మండిపడుతున్నారు. లక్షల కోట్ల కుంభకోణాలు చేసినవారు దేశం విడిచి పారిపోతే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఆడబిడ్డను వేధిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఆపాలన్నారు. ఇటు కవిత మాత్రం విచారణలను ఎదుర్కొంటూనే, మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం తన పోరాటం కొనసాగిస్తున్నారు.

First Published:  23 March 2023 9:34 AM IST
Next Story