Telugu Global
Telangana

కవిత కస్టడీ పొడిగింపు

విచారణ జరిపిన కోర్టు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. జూన్-3 వరకు కవిత కస్టడీని పొడిగించింది.

కవిత కస్టడీ పొడిగింపు
X

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. వాస్తవానికి ఆమె కస్టడీ నేటితో ముగుస్తుండగా ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరిచారు అధికారులు. విచారణ జరిపిన కోర్టు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. జూన్-3 వరకు కవిత కస్టడీని పొడిగించింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఆమెను ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ లో విచారణ జరిగింది. కవితను ఈడీ కస్టడీకి అప్పగించి, విచారణ పూర్తయిన తర్వాత మార్చి 26 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. ఆ తర్వాత సీబీఐ కూడా ఇదే కేసులో కవితను తమ అధీనంలోకి తీసుకుని విచారించింది. అప్పటినుంచి ఆమె తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఆ గడువు నేటితో పూర్తి కాగా.. ఈరోజు కోర్టు కస్టడీ పొడిగించింది.

కవితకు ఈ కేసులో బెయిల్ కూడా వాయిదా పడుతోంది. బెయిల్ కోసం ఆమె తరపు లాయర్లు ప్రయత్నించినా సాధ్యం కావడంలేదు. ఈడీ, సీబీఐ ఆమెపై కక్షగట్టి అరెస్ట్ చేశాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తన కుమార్తె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటకొస్తుందని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. బీజేపీ మాట విననందుకే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్ కూడా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత కస్టడీ విషయంలో మరోసారి బీఆర్ఎస్ నేతలకు నిరాశ ఎదురైంది.

First Published:  20 May 2024 9:47 AM GMT
Next Story