Telugu Global
Telangana

కొత్త ఓటర్లు ఆ ఒక్క పని చేయండి చాలు..

ఎన్నికలు బ్రహ్మ పదార్థం, మనకేం సంబంధం ఉంది అని ఎవరూ అనుకోవద్దని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఆ ఆలోచన నుండి విద్యార్థులు బయటకు రావాలని కోరారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని చెప్పారు.

కొత్త ఓటర్లు ఆ ఒక్క పని చేయండి చాలు..
X

సైనికులు సరిహద్దుల్లో నిలబడి దేశం కోసం యుద్ధం చేస్తున్నారని, యవత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా..? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. దేశంలో అభివృద్ధి జరగాలంటే, యువత ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పట్టణాల కంటే గ్రామాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని, పట్టణాల్లో చదువుకున్నవారు ఎక్కువ ఉన్నా ఓటింగ్ ఎందుకు ఎక్కువగా నమోదు కావడం లేదని ప్రశ్నించారు. యువత లో చైతన్యం రావాలని, మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా ఉంటుందని చెప్పారు. మహిళలే ఎక్కువ బాధ్యతాయుతంగా ఆలోచిస్తారని అన్నారు. నిజామాబాద్ లో విద్యార్థులు, కొత్త ఓటర్లతో ఎమ్మెల్సీ కవిత ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా ఓటు పొందిన ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను పూర్తి చేయాలన్నారు.


ఎన్నికలు బ్రహ్మ పదార్థం, మనకేం సంబంధం ఉంది అని ఎవరూ అనుకోవద్దని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఆ ఆలోచన నుండి విద్యార్థులు బయటకు రావాలని కోరారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, స్వేచ్ఛాయుతంగా ఉండటం అనేది ముఖ్యం అని చెప్పారు. ఈరోజు ఉన్న స్వేచ్ఛను పోకుండా కాపాడు కోవాలన్నారు. దేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన ఆంగ్లేయులు ప్రజల స్వేచ్ఛను హరించారన్నారు. ప్రశ్నించటం తెలంగాణ రక్తం లోనే ఉందని, తెలంగాణ యువత ఓటు హక్కుని వినియోగించుకుని బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నికోవాలని చెప్పారు కవిత.

యువత తమ వాయిస్ ను వినిపించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్సీ కవిత. తప్పుడు ప్రభుత్వాలు అధికారం లోకి వస్తే, దేశ యువతకు తీరని అన్యాయం జరుగుతుందన్నారామె. యువత భవిష్యత్ పై ప్రభావం పడుతుందని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అడవుల శాతం పెరగలేదని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ సంకల్పంతో ఇక్కడ అడవుల శాతం పెరిగిందని వివరించారు.


First Published:  23 Nov 2023 3:15 PM IST
Next Story