Telugu Global
Telangana

కేసీఆర్ హయాంలో రైతులకు మర్యాద -ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ఏర్పాటుకి ముందు రైతు వస్తున్నాడంటే అప్పుకోసం అనుకునే రోజులు ఉండేవని... కానీ ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని, ఆత్మహత్యలు అనే మాట లేనే లేదన్నారు ఎమ్మెల్సీ కవిత.

కేసీఆర్ హయాంలో రైతులకు మర్యాద -ఎమ్మెల్సీ కవిత
X

తెలంగాణలో రైతుల‌కు మ‌ర్యాద తెచ్చింది కేసీఆర్ ప్ర‌భుత్వ‌మేనని చెప్పారు ఎమ్మెల్సీ క‌విత‌. తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌ల్లో భాగంగా నేడు రైతు దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం ప‌ద్మాజివాడ‌లో నిర్వ‌హించిన రైతు దినోత్స‌వంలో పాల్గొన్న కవిత.. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలను వివరించారు. రైతులు లాభదాయకమైన పంటలపై దృష్టిపెట్టాలని సూచించారు.

తెలంగాణ రాకముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు కవిత. న‌కిలీ విత్త‌నాలు అనే మాటే వినపడటం లేదన్నారు. న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేసే వారిపై పీడీ యాక్ట్ న‌మోదు చేస్తున్నామ‌ని చెప్పారు. విత్త‌నాలు, ఎరువుల కొర‌త లేనే లేదని, క‌రెంట్ స‌మ‌స్య‌లు కూడా లేవ‌ని స్ప‌ష్టం చేశారు. మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామ‌ని , పెరిగిన భూగర్భ జలాలతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు త్వరలోనే ప్రారంభిస్తామ‌ని హామీ ఇచ్చారు కవిత. వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింద‌న్నారు. రైతుల కోసం సంఘాలు పెట్టిన ఘనత కేసీఆర్‌ దేనని స్ప‌ష్టం చేశారు.

సరిహద్దులో జవాన్, పొలంలో కిసాన్.. వీరిద్దరి వల్లే మనం ప్రశాంతంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. రైతుకు మర్యాద తెచ్చింది తమ ప్రభుత్వమేనన్నారు. రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతకు అండగా ఉన్నామ‌ని, వ్యవసాయం అంటే దండగ అనే స్థితి నుంచి నేడు పండగ అనే స్థాయికి తీసుకొచ్చామ‌ని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకి ముందు రైతు వస్తున్నాడంటే అప్పుకోసం అనుకునే రోజులు ఉండేవని... కానీ ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని, ఆత్మహత్యలు అనే మాట లేనే లేదన్నారు.

First Published:  3 Jun 2023 10:39 AM GMT
Next Story