Telugu Global
Telangana

బండికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కవిత

ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యం అన్నారు. ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది అని కౌంటర్ ఇచ్చారు కవిత.

బండికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కవిత
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కాస్త వెటకారంగా ట్వీట్ వేశారు. మహిళా గవర్నర్ ని అవమానించారని, ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో అడ్డుపడ్డారని.. అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా బదులిచ్చారు. మాటకు మాట అప్పజెప్పారు. బండికి సౌండ్ లేకుండా చేశారు.

కవిత ఏమన్నారంటే..?

పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కలేదన్నారు కవిత. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని.. బేటీ బచావో - బేటీ పఢావో కేవలం నినాదాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.


గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి దేశంలో ఉందన్నారు కవిత. మహిళల విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యం అన్నారు. ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది అని కౌంటర్ ఇచ్చారు కవిత.

First Published:  13 Jun 2023 4:36 PM IST
Next Story