Telugu Global
Telangana

అవన్నీ ఫేక్ సర్వేలు -కవిత

రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న పింక్ వేవ్ చూస్తే బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించి ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు కవిత. పోలింగ్ శాతం ఎంత ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గెలుపు తధ్యమని చెప్పారు.

అవన్నీ ఫేక్ సర్వేలు -కవిత
X

ప్రజలను తప్పదోవ పట్టించడానికి అనేక ఫేక్ సర్వేలు వస్తుంటాయని అన్నారు ఎమ్మెల్సీ కవిత. గత ఎన్నికల్లోనూ ఇలానే జరిగిందని, ఈసారి కూడా ఇలాంటి ఫేక్ సర్వేలతో ప్రజల్ని ఇంకా మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పింక్ వేవ్ కనిపించిందన్నారు.


నిజామాబాద్ జిల్లాతోపాటు.. ఇతర ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్సీ కవిత ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయంలో ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపించిందని చెప్పారామె. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉన్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, చైతన్యవంతమైన ప్రజలు ఉంటారని.. ప్రజలకు మేలు చేసే ప్రతినిధులు ఉండాలని ప్రజలు నిర్ణయించినట్లు అర్థమవుతోందని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి తమకు అందుతున్న సమాచారం ప్రకారం విజయం బీఆర్ఎస్ దేనన్నారు. పెద్దమ్మ తల్లి దయవల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నానని తెలిపారు కవిత.

రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న పింక్ వేవ్ చూస్తే బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించి ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు కవిత. పోలింగ్ శాతం ఎంత ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గెలుపు తధ్యమని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే సంబరాలు జరుపుకుంటున్నామని, ఎమ్మెల్యేలు గెలుపు పట్ల విశ్వాసంతో ఉన్నారని అన్నారు కవిత.

First Published:  30 Nov 2023 8:52 PM IST
Next Story