Telugu Global
Telangana

తెలంగాణ ఆడపిల్లల కండ్ల నుంచి నీళ్ళు రావు నిప్పులొస్తయ్... కల్వకుంట్ల కవిత‌

ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ...''ఇప్పుడు యువతీ యువకులు దేశం గురించి ఆలోచించాలె. దేశంలో హక్కులు కోల్పోతున్నాం. మేదావులు మాట్లాడటం మానేశారు. కవులు, రచయితలు రాయడం మానేశారు. ఇప్పుడు మనం అందరినీ కదిలించాలి. జాగృతి తరపున దేశ‌వ్యాప్తంగా ప్రచారం చేయాలి. దేశవ్యాప్తంగా కవులు, కళాకారులను, విద్యార్థులను, స్త్రీలను, మేదావులను ఏకం చేయాలి'' అని అన్నారు

తెలంగాణ ఆడపిల్లల కండ్ల నుంచి నీళ్ళు రావు నిప్పులొస్తయ్... కల్వకుంట్ల కవిత‌
X

తెల‍ంగాణ ఉద్యమంలో ఎలాగైతే గ్రామ గ్రామాన ప్రజలు ఏకమయ్యారో, కవులు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు, స్త్రీలు ఏకమయ్యి పోరాడారో మళ్ళీ ఇప్పుడు దేశం కోసం అలాగే పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ...''ఇప్పుడు యువతీ యువకులు దేశం గురించి ఆలోచించాలె. దేశంలో హక్కులు కోల్పోతున్నాం. మేదావులు మాట్లాడటం మానేశారు. కవులు, రచయితలు రాయడం మానేశారు. ఇప్పుడు మనం అందరినీ కదిలించాలి. జాగృతి తరపున దేశ‌వ్యాప్తంగా ప్రచారం చేయాలి. దేశవ్యాప్తంగా కవులు, కళాకారులను, విద్యార్థులను, స్త్రీలను, మేదావులను ఏకం చేయాలి'' అని అన్నారు.

''దేశంలో ప్రజాస్వామిక విలువలు మంటగలుస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ అప్రజాస్వామికంగా కూలగొడుతూ ఉంటే మీడియా బీజెపికీ మద్దతుగా నిలబడింది. బీజేపీకి మద్దతుగా రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది.. పొగుడుతున్నది. ఫోర్త్ ఎస్టేట్ కాస్తా ప్రైవేట్ ఎస్టేట్ గా మారింది. '' అని కవిత మండిపడ్డారు.

''దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలి. బీజేపీ దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నది. ఎవరికో నష్టం జరిగిందికదా మనకెందుకు అనుకుంటే రేపు మనవరకు వస్తది. అందుకే మనం ఇప్పుడు దేశవ్యాప్తంగా భావజాల ప్రచారం చేయాలి ప్రగతిశీల ఆలోచనలు పెంపొందించేందుకు మనం కృషి చేయాలి'' అని కవిత కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

''కేంద్ర‌ ఏజెన్సీల ద్వారా బీజేపీ విపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతున్నది. నామీద ఒక్కదాని మీదనే కాదు తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిపై దాడులు చేస్తున్నారు. ఈ సమావేశంలో కొందరు నన్ను సీబీఐ ప్రశ్నించడంపై మాట్లాడుతూ ఆడపిల్లతో కన్నీళ్ళు పెట్టించారు అని అన్నారు. మిగతావారి సంగతి తెలియదు కానీ తెలంగాణ ఆడపిల్లల కండ్ల‌ నుండి నీళ్ళు రావు నిప్పులొస్తయ్.'' అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

First Published:  12 Dec 2022 6:13 PM IST
Next Story