భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్‌గా కవిత
స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా తెలిపారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్‌కుమార్ కౌషిక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ బాధ్యతల్లో కవిత ఏడాది పాటు సేవలు అందించనున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా 2015 నుంచి ఆమె సేవలందిస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా తెలిపారు.
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బొగ్గు గనులను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కార్మికుల పక్షాన తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం (టీబీజీకేఎస్) పోరాడుతోందని చెప్పారు. అహర్నిశలు శ్రమించి, దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మిక కుటుంబాల సంక్షేమానికి సంఘం నిరంతరం కృషిచేస్తోందని ఆమె తెలిపారు. టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.