Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు : జగ్గు స్వామిపై లుకౌట్ నోటీసులు

డాక్టర్ కొట్టిలిల్ నారాయణ్ జగ్గు అలియాస్ జగ్గు స్వామి ఎర్నాకులంలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డాక్టర్‌గా గుర్తింపు పొందారు. "నలుగురు TRS ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపి బిజెపిలోకి ఫిరాయింపజేసేందుకు జరిగిన‌ కుట్రలో కీలక పాత్ర పోషించారు

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు : జగ్గు స్వామిపై లుకౌట్ నోటీసులు
X

టీఆరెస్ ఎమ్మెల్యేల‌ కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో కేరళకు చెందిన జగ్గు స్వామిని వాంటెడ్ వ్యక్తిగా పేర్కొంటూ తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.

డాక్టర్ కొట్టిలిల్ నారాయణ్ జగ్గు అలియాస్ జగ్గు స్వామి ఎర్నాకులంలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డాక్టర్‌గా గుర్తింపు పొందారు. "నలుగురు TRS ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపి బిజెపిలోకి ఫిరాయింపజేసేందుకు జరిగిన‌ కుట్రలో కీలక పాత్ర పోషించారు". అని నోటీసు లో పేర్కొన్నారు.

'ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు, అస్థిరపరిచేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడానికి ప్రేరేపించడంతోపాటు వారి విధులను సక్రమంగా నిర్వర్తించకుండా చేయడ‍ం నేరపూరిత బెదిరింపు' తదితర కేసులను నోటీసులో పేర్కొన్నారు.

జగ్గు స్వామి తన నివాసం, పని స్థలం నుండి పరారీలో ఉన్నాడని పేర్కొంటూ, భారతదేశం అంతటా అన్ని పోలీసు యూనిట్లకు, పోలీసు స్టేషన్‌లకు లుక్ అవుట్ నోటీసును తెలంగాణ పోలీసులు పంపారు. అతను కనపడ్డా, అతనికి సంబంధించిన విషయాలేమైనా తెలిసినా హైదరాబాద్ సిటీ కంట్రోల్ రూమ్‌కు ఆధారాలను అందించాలని నోటీసు కోరింది. ఏసీపీ రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ డీసీపీ, మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లకు సంబంధించిన అన్ని సంస్థల కాంటాక్ట్ నంబర్‌లను కూడా అందించారు.

ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఉన్న రాజేంద్రనగర్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు.

కాగా తనకు తాను వైద్యుడిగా ప్రచారం చేసుకుంటున్న జగ్గు స్వామి అసలు డాక్టరే కాదని మీడియా విచారణలో తేలింది. కేరళలోని ఎర్నాకులంలో ఉండే జగ్గుస్వామి అమృత మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఉంటాడని, అక్కడ ఆయన ఇప్పుడు కీలక వ్యక్తి అని చెప్తున్నారు. తనకు తాను ఆయన డాక్టర్‌ అని చెప్పుకుంటారని, కానీ, ఎక్కడ వైద్య విద్య అభ్యసించలేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

First Published:  22 Nov 2022 8:24 AM IST
Next Story