ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: రామచంద్ర భారతికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ
మొయినాబాద్ ఫార్మ్ హౌజ్ కుట్ర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.
BY Telugu Global21 Nov 2022 3:45 PM IST
X
Telugu Global Updated On: 21 Nov 2022 3:45 PM IST
టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పిటిషన్ ను కొట్టి వేసిన సుప్రీం కోర్టు నిందితులు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.
మరో వైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందంపై హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణను సుప్రీం కోర్టు ఎత్తి వేసింది. సిట్ దర్యాప్తు కొనసాగాలని, దర్యాప్తు చేయడంలో సిట్ కు పూర్తి స్వేచ్చ ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Next Story