Telugu Global
Telangana

కాంగ్రెస్‌లోకి పైళ్ల.. వద్దంటున్న కుంభం

ఇటీవల స్థానికంగా జరిగిన ఓ సమావేశంలో ఇదే అంశంపై మాట్లాడారు కుంభం అనిల్ కుమార్. పైళ్ల పార్టీలోకి వస్తారన్న వార్తలతో కాంగ్రెస్‌ కేడర్‌ ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌లోకి పైళ్ల.. వద్దంటున్న కుంభం
X

భువనగిరి కాంగ్రెస్‌లో చేరికల పంచాయితీ మొదలైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రాకను ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆయన పార్టీలోకి వస్తే తాను పార్టీలో ఉండనంటూ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.

భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. భువనగిరి ఎంపీ టికెట్‌ హామీతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే పైళ్ల శేఖర్‌ రెడ్డి పార్టీలోకి వస్తే ఒప్పుకునేది లేదంటూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ భీష్మించి కూర్చున్నారు తెలుస్తోంది.

ఇటీవల స్థానికంగా జరిగిన ఓ సమావేశంలో ఇదే అంశంపై మాట్లాడారు కుంభం అనిల్ కుమార్. పైళ్ల పార్టీలోకి వస్తారన్న వార్తలతో కాంగ్రెస్‌ కేడర్‌ ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. అధికారం లేకపోతే మూడు నెలలు కూడా ఉండలేరా అంటూ పరోక్షంగా పైళ్లపై ఫైర్ అయ్యారు. తాను ప్రతిపక్షంలో ఉండి 8 సంవత్సరాలు ప్రజాసమస్యలపై కొట్లాడనని చెప్పారు. ఎమ్మెల్యే కంటే ప్రతిపక్ష బాధ్యతే గొప్పదన్నారు పైళ్ల. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించే అధికారం ఉంటుందని.. అధికారంలో ఉంటే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. పైళ్లను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీకి ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

First Published:  21 March 2024 10:24 AM GMT
Next Story